విజయ్ సేతుపతి - కత్రినా కైఫ్ జంటగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం 'మేరీ క్రిస్మస్'. ఈ చిత్రానికి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. థ్రిల్లర్ సినిమాలు తీయడంలో ఈ దర్శకుడిది ప్రత్యేక శైలి. 'అంధాధున్' తర్వాత ఆయన చేస్తున్న సినిమా ఇది. గత ఏడాది డిసెంబర్ లో షూటింగ్ షురూ అయింది. ఈ ఏడాది డిసెంబర్ 23న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సీనియర్ నటి రాధిక కీలక పాత్రలో నటిస్తు న్నారు. తాజా షెడ్యూల్ లో వీరిద్దరి మధ్య వచ్చే కీలక సన్నివే శాలు తెరకెక్కిస్తున్నారు. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు చిత్రబృందం రిలీజ్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa