మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, క్రేజీ హీరోయిన్ సమంత ఒక సినిమా చేస్తున్నారన్న వార్త ఇటీవలి కాలంలో జోరుగా సాగుతుంది. ఈ సినిమాపై రోజుకొక ఇంటరెస్టింగ్ న్యూస్ బయటకు వస్తుంది. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ తాజాగా ఈ మూవీ ప్రారంభ కార్యక్రమం హైదరాబాద్ లో లాంఛనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ సెలెబ్రిటీలు హాజరయ్యారు. డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఫస్ట్ క్లాప్ కొత్తగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు స్క్రిప్ట్ ను డైరెక్టర్ శివ నిర్వాణ కు అందించగా, ఆయన తొలి షాట్ ను తీశారు.
కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో నడిచే అందమైన ప్రేమ కథగా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. విజయ్ కెరీర్లో ఇది 11 వ సినిమా కావటంతో #VD 11 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను పిలుస్తున్నారు. మలయాళ మ్యూజిక్ సంచలనం అబ్దుల్ వాహబ్ ను ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన విషయాలను చిత్రబృందం త్వరలోనే తెలియజేస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa