మన టాలీవుడ్ లో లేటెస్ట్ గా మరో క్రేజీ కాంబో సెట్ అయ్యింది అని చెప్పాలి. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ సినిమా రూపొందిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమ 19వ సినిమాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయ్ దేవరకొండ సరసన సమంత నాయికగా నటిస్తోంది.
ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ ఇవ్వగా…ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స్క్రిప్టును మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు వై రవిశంకర్, నవీన్ యేర్నేని దర్శకుడు శివ నిర్వాణకు అందజేశారు.ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోంది. గీత గోవిందం లాంటి ప్లెజంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో విజయ్ సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లైగర్ వంటి యాక్షన్ ఎంటర్ టైనర్ తర్వాత మళ్లీ చక్కటి కుటుంబ కథలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు.
హిట్ సినిమాలు నిన్ను కోరి, మజిలీ వంటి అందమైన సకుటుంబ ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ మరోసారి తన సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్ చేయబోతున్నారు. గతంలో మహానటి చిత్రంలో విజయ్, సమంత కలిసి నటించగా…ఈ సినిమా వారి పెయిర్ ను ఫుల్ ఫ్లెజ్డ్ గా తెరపై చూపించబోతోంది. ఇక మజిలీ చిత్రం తరువాత శివ నిర్వాణ డైరెక్షన్ లో సమంత నటిస్తుండటం విశేషం.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో విజయ్ డియర్ కామ్రేడ్ వంటి డిఫరెంట్ అటెంప్ట్ చేశారు. ఈ సంస్థలో మరోసారి హీరోగా నటిస్తున్నారు. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత సమంత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే కశ్మీర్ లో మొదలవుతుంది. అక్కడ లెంగ్తీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్, వైజాగ్, అల్లెప్పి లలో మిగతా షూటింగ్ జరుపుకోనుంది.
మరి ఈ సినిమాకి టెక్నికల్ టీమ్: మేకప్: బాషా, కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్, హర్మన్ కౌర్, పల్లవి సింగ్, ఆర్ట్: ఉత్తర కుమార్, చంద్రిక, ఫైట్స్: పీటర్ హెయిన్, రచనా సహకారం: నరేష్ బాబు.పి, పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా, పబ్లిసిటీ : బాబ సాయి, మార్కెటింగ్ : ఫస్ట్ షో, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దినేష్ నరసింహన్, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్, మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్, సి.ఇ.ఓ : చెర్రీ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జి.మురళి, నిర్మాతలు : నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి, కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: శివ నిర్వాణ లు అందిస్తున్నారు.
#VD11 Launched
Our Heartthrob @TheDeverakonda & Queen @Samanthaprabhu2 reunite for a Family Entertainer under the direction of @ShivaNirvana
Music by @HeshamAWMusic
Shoot begins this month! #VD11Launch pic.twitter.com/rjAtG5Td0B
— Mythri Movie Makers (@MythriOfficial) April 21, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa