ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖాన్ తన కుమారులతో ఇచ్చిన స్టిల్ సోషల్ మీడియాలో వైరల్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 02, 2018, 02:07 PM

బాలీవుడ్ లో ఎంత మంది ఖాన్ లు ఉన్నా కూడా షారుక్ ఖాన్ కి ఉండే క్రేజ్ వేరనే చెప్పాలి. ఎలాంటి సినిమా చేసినా కూడా తన ప్రత్యేకత ఉండేలా చూసుకోవడం ఈ హీరోకి అలవాటు. కష్టపడి పైకొచ్చిన ఈ హీరోకి అన్ని విషయాలు బాగా తెలుసు. ముఖ్యంగా కుటుంబ విషయంలో ఈ కథానాయకుడు తీసుకునే జాగ్రతలు అన్ని ఇన్నీకావు. గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటాడు. ఒక తండ్రిగా షారుక్ కి అన్ని కోణాలు తెలుసు. 


క్రమశిక్షణతో ఉంచడంతో పాటు ఎంతో న్సహెంగా కూడా ఉంటారు. షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు పిలల్లతో కలిసి ఉండడం హాలిడేస్ వెకేషన్స్ కి వెళ్లడం షారుక్ కి అలవాటు. ఇకపోతే రీసెంట్ గా ఖాన్ తన కుమారులతో ఇచ్చిన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముగ్గురు ఖాన్ లు దర్జాగా కూర్చొని చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ అయితే యువ హీరో అవ్వడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. 


1997లో జన్మించిన ఈ కుర్రాడు ప్రస్తుతం యూకే లో ఆర్యన్ డీగ్రే చేస్తున్నాడు. ఇక మరో చిన్న తనయుడు అబ్రామ్ 2013లో సరోగసి ద్వారా జన్మించిన సంగతి తెలిసిందే. ముగ్గురు ఖాన్ లు కూల్ గ్లాసెస్ తో జాకెట్ లు ధరించి మంచి స్టైల్ లో కనిపిస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం షారుక్ జీరో సినిమాతో బిజీగా వున్నాడు. ఆనంద్ ఎల్ రాయ్ ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa