హాలీవుడ్ చిత్రాలని ఇష్టపడేవాళ్లకు ఒక శుభవార్త. ఎవరైతే 'ది మ్యాట్రిక్స్ రిజరెక్షన్స్' ' మూవీని థియేటర్లలో చూడలేకపోయారే వాళ్ళందరూ ఓటిటిలో చూడటానికి రెడీగా ఉండండి. ప్రముఖ ఓటిటి దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో లో వచ్చే నెల 12 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ అధికారిక ప్రకటన చేసింది. డిసెంబర్ 22, 2021న విడుదలైన ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మే 12 నుండి అందుబాటులోకి రానుంది.
'ది మ్యాట్రిక్స్' అనే సినిమాతో 1999లో ప్రారంభమైన 'మ్యాట్రిక్స్' మూవీ జర్నీ ఫ్రాంచైజీ గా మారింది. ఈ సిరీస్ లో భాగంగా ఇప్పటివరకు మూడు సినిమాలొచ్చాయి. 2003లో ఒకేసారి 'ది మ్యాట్రిక్స్ రీలోడెడ్', 'ది మ్యాట్రిక్స్ రివొల్యూషన్స్' అనే సినిమాలు విడుదలయ్యాయి. గతేడాది విడుదలైన 'ది మ్యాట్రిక్స్ రిజరెక్షన్స్' మూవీ ఈ సిరీస్ లో నాలుగో చిత్రం. ఈ సిరీస్ కు రూపకర్తలు లానా వచోవ్స్కి , లిల్లీ వచోవ్స్కి. మొదటి భాగం నుండి కీను రీవ్స్ ఈ సిరీస్లో లీడ్ రోల్ లో నటిస్తూ వస్తున్నారు. ఈ ప్రెస్టీజియస్ హాలీవుడ్ మూవీలో మాజీ విశ్వ సుందరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సతి అనే పాత్రలో నటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa