ఏప్రిల్ 14న విడుదలైనప్పటి నుండి అప్పటివరకు ఉన్న రికార్డులను ఒక్కొక్కొటిగా చెరిపేస్తూ వెళ్తుంది 'కేజీఎఫ్ 2' మూవీ. తాజాగా ఈ సినిమా మరొక మైల్ స్టోన్ ను తన ఖాతాలో వేసుకుంది. రూ. 250 కోట్ల మార్కును అతివేగంగా అందుకున్న తొలి చిత్రంగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డును సృష్టించింది. ఆ తర్వాతి స్థానాల్లో బాహుబలి 2 (8 రోజుల్లో) , దంగల్,సంజు, టైగర్ జిందా హై (10 రోజుల్లో) 250 కోట్ల మార్కును అందుకున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ సినీ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 వసూళ్లు ఇలా ఉన్నాయి. గురువారం- 53.95 కోట్లు, శుక్రవారం - 46.79 కోట్లు, శనివారం- 42.90 కోట్లు, ఆదివారం-50.35 కోట్లు, సోమవారం-25.57 కోట్లు, మంగళవారం-19.14కోట్లు, బుధవారం - 16. 35 కోట్లు, మొత్తం 7 రోజుల్లో 255.05 కోట్ల వసూళ్లను సాధించింది ఈ సినిమా. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇలానే సక్సెస్ ఫుల్ గా రన్ అయితే దంగల్ జీవితకాల కలెక్షన్లు రూ. 380 కోట్లను కేజీఎఫ్ 2 సులభంగా అధిగమిస్తుందని ఆదర్శ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్ల పై చిలికి వసూళ్లను సాధించింది. దీంతో బాహుబలి 1 జీవితకాల కలెక్షన్లను కేవలం 7 రోజుల్లోనే కేజీఎఫ్ 2 అధిగమించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa