ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ తేజ్, అజయ్ దేవగణ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్ ప్రధాన పాత్రలుగా నటించిన పాన్ ఇండియా చిత్రం ఆర్ ఆర్ ఆర్. మార్చి 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ను రాబట్టి అదే జోరుతో థియేటర్లలో ఇప్పటికీ రన్ అవుతుంది. ఇప్పటివరకు దాదాపు 1200కోట్లకు పైగా వసూలు చేసిన ఈ మూవీ లాంగ్ రన్ లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి నాటు నాటు, కొమ్మా ఉయ్యాలా అనే వీడియో పాటలు విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్ దోస్తీ ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఎం.ఎం కీరవాణి కంపోజ్ చేసిన ఈ గీతాన్ని ఐదు భాషల్లో ఐదుగురు ప్రముఖులు ఆలపించారు. దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించగా హేమచంద్ర ఆలపించారు. ఈ పాట ప్రేక్షకుల నుండి ఎలాంటి ఆదరణను సొంతం చేసుకుంటుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa