టాలీవుడ్ సక్సెస్ మెషిన్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ఆచార్య. చిరు కెరీర్లో 153వ చిత్రం ఇది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ద అనే స్పెషల్ రోల్ చేస్తూ ఈ సినిమాకు మరింత హైప్ ఇచ్చాడు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్, చరణ్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఏప్రిల్ 23న సాయంత్రం 6 గంటలనుండి ఈ వేడుక జరగనుంది. ముందుగా ఈ మూవీ కి చీఫ్ గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారనీ, ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ఈ వేడుకలో పాల్గొంటారని పుకార్లు వచ్చాయి. అయితే అధికారిక ప్రకటనను బట్టి ఈ ఈవెంటుకు ముఖ్యఅతిథిగా ఎవరినీ ఆహ్వానించలేదని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa