ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ కి థాంక్స్ చెప్పిన మెగాస్టార్ !

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 22, 2022, 12:39 PM

టాలీవుడ్ మెగాస్టార్​ చిరంజీవి సూపర్​ స్టార్​ మహేశ్​బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.​ చిరంజీవి, రామ్​ చరణ్ కాంబినేషన్​లో వస్తున్న 'ఆచార్య' సినిమాకు మహేశ్​ వాయిస్ ఓవర్ అందించనున్నట్లు వారు స్పష్టం చేశారు. మహేశ్ వాయిస్ ఓవర్ తో ఈ సినిమా మరింత ప్రత్యేకంగా మారనుందని చిరంజీవి, రామ్ చరణ్ లు పేర్కొన్నారు.


'ఆచార్య' సినిమాను కొరటాల శివ తెరకెక్కించారు. దేవాలయాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా కోసం 'ధర్మస్థలి' పేరుతో ఓ భారీ సెట్‌ ని క్రియేట్‌ చేశారు. పూజా హెగ్డే, కాజల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడెక్షన్స్‌ బ్యానర్స్‌పై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌ ఈ సినిమాను నిర్మించారు. మణిశర్మ మ్యూజిక్ అందించారు. ఏప్రిల్‌ 29న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa