ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆకట్టుకుంటున్న విక్రమ్ 'కోబ్రా' సెకండ్ సింగిల్ ...

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 22, 2022, 10:29 PM

'మహాన్' ఘనవిజయం తర్వాత చియాన్ విక్రమ్ నటిస్తున్న కొత్త చిత్రం కోబ్రా. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఆర్. జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో కేజీఎఫ్ భామ శ్రీనిధిశెట్టి హీరోయిన్. మాజీ ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ఏ. ఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా, తాజాగా ఈ మూవీ నుండి మరో పాట విడుదలైంది. అధీరా అంటూ సాగే ఈ పాటలో విక్రమ్ పలు క్రేజీ గెటప్ లలో కనిపించి ప్రేక్షకులను కనువిందు చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa