వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన "ది కాశ్మీర్ ఫైల్స్" మార్చి 11న థియేటర్‌లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కశ్మీర్ లో సాగే ఈ సినిమా భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఇరుక్కున్న కాశ్మీరీల అంశాలతో ఈ సినిమా వచ్చింది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 250 కోట్లలకి పైగా వసూలు చేసి రికార్డులను సృష్టించింది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ అండ్ పల్లవి జోషి ముఖ్యమైన పాత్రలు పోషించారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా త్వరలో ZEE5లో ప్రసారం కానుందని సమాచారం. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రసారం కానుంది. మే మొదటి వారంలో ZEE5లో సినిమా విడుదల కానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa