టాలీవుడ్ మెగా స్టార్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న "ఆచార్య" సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఏప్రిల్ 29, 2022 రిలీజ్ కి సిద్ధంగా ఉంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా కాజల్ అగర్వాల్ అండ్ పూజహెడ్జ్ నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించడానికి రంగం సిద్ధమైంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని CBFC నుండి U/A సర్టిఫికేట్ పొందింది అని సమాచారం. ఇదే విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరగనుంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నాయి. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa