సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉండే సమంత..తాజాగా చేసిన ట్వీట్ అందరు మాట్లాడుకునేలా చేసింది. ‘‘నా నిశ్శబ్దాన్ని తెలియనితనంగా.. నా మౌనాన్ని అంగీకారంగా.. నా దయని బలహీనతగా ఎప్పుడూ చూడకండి.. దయకి కూడా ఒక ముగింపు తేదీ ఉంటుంది’’ అంటూ సమంత చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అసలు ఆమె దేనిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసి ఉంటుందనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారింది. ప్రస్తుతం ఆమె విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో చేస్తున్న ‘కన్మణి రాంబో ఖతీజా’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. తాజాగా విడుదలైన చిత్ర పాటలలో ఆమె గ్లామర్ ప్రదర్శన హాట్ టాపిక్ అవుతుంది. ఈ విషయంపై ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేస్తే ఆమె అలా స్పందించిందా? లేదంటే విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తాజాగా ఓ చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి సమంత హాజరు కాలేదని.. హీరో విజయ్ దేవరకొండ చేసిన పని ఆమెకు నచ్చలేదా..? అసలు దేనికి సామ్ ఈ ట్వీట్ చేసింది అని అంత మాట్లాడుకుంటున్నారు.
Don't ever mistake
MY SILENCE
for ignorance,
MY CALMNESS
for acceptance,
My
KINDNESS
for weakness.
— Samantha (@Samanthaprabhu2) April 22, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa