ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆచార్య నుండి పర్ఫెక్ట్ మెగా డాన్స్ గ్లిమ్స్ ఔట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 23, 2022, 01:04 PM

టాలీవుడ్ సక్సెస్ మెషిన్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ఆచార్య. చిరు కెరీర్లో 153వ చిత్రం ఇది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ద అనే స్పెషల్ రోల్ చేస్తూ ఈ సినిమాకు మరింత హైప్ ఇచ్చాడు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్, చరణ్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్  నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దేవాదాయ భూముల కుంభకోణం వంటి పవర్ఫుల్ సబ్జెక్టు తో తండ్రికొడుకులిద్దరూ వెండితెరపై చేసే మ్యాజిక్ ను చూడటానికి పేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరు డాన్స్ గ్లిమ్స్ ను విడుదల చేసారు. ఈ మూవీ నుండి మొదటి పాటగా విడుదలైన లాహే లాహే... లాహే పాట లో చిరు వేసిన క్లాసి అండ్ గ్రెస్ స్టెప్స్ తో కూడిన గ్లిమ్స్  రిలీజ్ అయ్యింది.  మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల నుండి కూడా ఈ గ్లిమ్స్ కు విశేష ఆదరణ దక్కుతుంది. రాంచరణ్ ఫ్యాన్స్ తమ ట్విట్టర్ పేజీలో సైతం ఈ గ్లిమ్స్ ను పెట్టి శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం  ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa