కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, గత కొంతకాలంగా చేస్తున్న సినిమాలను ఒకసారి పరీక్షిస్తే, వాటన్నిటికీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టింది యువకులే. సీనియర్ దర్శకుల కన్నా యువదర్శకులు తనను మరింత స్టైలిష్ గా, క్రేజీగా చూపిస్తున్నారని వారితో పనిచేయటానికి రజినీ మక్కువ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే యువ దర్శకుడు వరుణ్ డాక్టర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ కు కూడా అవకాశం ఇచ్చారు రజిని. తన 169 వ సినిమా కు దర్శకత్వం వహించే అవకాశాన్ని నెల్సన్ కు పిలిచి మరీ ఇచ్చారు. నెల్సన్ దర్శకత్వం లో విజయ్ నటించిన బీస్ట్ భారీ అంచనాల నడుమ ఇటీవలనే విడుదలై, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఫలితానికి ఏమాత్రం లోను కాకుండా, నెల్సన్ ప్రతిభపై నూరుశాతం నమ్మకముంచి తనతోనే సినిమా చెయ్యాలని రజినీ డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈ నిర్ణయం అభిమానులను ఒకింత ఆశ్చర్యపరిచినా తుదకు మిగిలే ఫలితంపై అంతటా ఆసక్తి నెలకొంది.
అయితే ఈ మూవీ నుండి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని ఒక కీలక పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ రంగంలోకి దిగనున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. వరుణ్ డాక్టర్ వంటి బిగ్గెస్ట్ ను తనకిచ్చిన నెల్సన్ రిక్వెస్ట్ ను కాదనలేక శివ కార్తికేయన్ ఈ మూవీ ని ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa