ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మమ్ముట్టి కొత్త చిత్రం సీబీఐ 5 ట్రైలర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 23, 2022, 03:48 PM

ఇటీవల విడుదలైన గ్యాంగ్ స్టర్ నేపధ్య చిత్రం భీష్మ పర్వం తో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి. తాజాగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం సీబీఐ 5. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. సేతురామ అయ్యర్ అనే సీబీఐ ఆఫీసర్ గా మమ్ముట్టి ఈ సినిమాలో నటిస్తున్నారు. ఒక సూసైడ్ మిస్టరీ కేసును చేధించే క్రమంలో ఎదురైన ఆసక్తికర సన్నివేశాలతో సాగిన ట్రైలర్ ఈ మూవీ పై అంచనాలను పెంచేస్తోంది. కే. మధు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సైనా మూవీస్ పతాకంపై స్వర్గచిత అప్పచ్చన్ నిర్మిస్తున్నారు. జెక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ కథను SN. స్వామి అందించారు.  సీబీఐ ఫ్రాంచైజీ లో 5వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సిరీస్ లో మొదటి భాగం 1988లో విడుదలైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa