కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్న కొత్త చిత్రం కాతువాకుల రెండు కాదల్. ఇందులో సమంత, నయనతార కథానాయికలు. నయనతార కాబోయే భర్త విగ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది. కన్మణి రాంబో ఖతీజా గా తెలుగులో కూడా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ ను ఓ రేంజులో నిర్వహిస్తున్నారు చిత్రబృందం. ఈ మూవీ నుండి ఒక్కొక్కటిగా సర్ప్రైజ్ ను రెవీల్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో విడుదలైన టూ టూ టూ , డిప్పమ్ డప్పమ్ పాటలు ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ దక్కించుకున్నాయి.
తాజాగా ఈ మూవీ నుండి ట్రైలర్ విడుదలైంది. విజయ్ సేతుపతి(రాంబో), నయనతార(కన్మణి), సమంత(ఖతీజా)ల మధ్య నడిచే ట్రైయాంగ్యులర్ లవ్ స్టోరీ గా ఈ సినిమా ఉండనుంది. ట్రైలర్ ప్రకారం, కన్మణి తో ముందుగానే వివాహం జరిగినప్పటికీ రాంబో ఖతీజాతో ఎఫైర్ పెట్టుకుంటాడు. అయితే ఈ విషయం బయటపడిన తర్వాత ఈ ట్రైయాంగ్యులర్ లవ్ స్టోరీ లో ఆఖరికి రాంబో మనసును ఎవరు గెలుచుకున్నారు? చివరికేమైంది? అనేది చాలా ఇంటరెస్టింగ్ గా ఉండనుంది. ఆద్యంతం ఎంతో ఫన్ గా సాగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa