2008 ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మేజర్'. టైటిల్ రోల్ లో అడవి శేష్ నటిస్తుండటమే కాక ఈ చిత్రానికి కథను కూడా అందించారు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ ఇండియా, GMB ఎంటర్టైన్మెంట్స్,A +S మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు,హిందీ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కన్నడ, మలయాళ, తమిళ భాషలలో కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో అడవి శేష్ పాన్ ఇండియా బరిలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనాతో పాటు పలు కారణాల వల్ల వాయిదా పడి ఎట్టకేలకు మే 27న థియేటర్లలోకి రానుంది.
తాజాగా ఈ మూవీ నుండి ఒక అప్డేట్ ఇచ్చారు అడవి శేష్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ కి సంబంధించి వర్కింగ్ స్టిల్ ను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆ పిక్ లో ప్రఖ్యాత తాజ్ హోటల్ నుండి మంటలు వస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఒక NSG కమాండ్ తాజ్ హోటల్ లో ఉన్న రహస్య ఉగ్రవాదిని మట్టుపెట్టటానికి తుపాకీ ఎక్కుపెట్టటం కూడా మనకి ఆ ఫొటోలో కనిపిస్తుంది. సయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్టుతో నిర్మించబడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa