ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేసిన 'KGF-2' టీమ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 25, 2022, 11:04 AM

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాకింగ్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి నటించిన 'KGF-2' ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూలని రాబడుతుంది. ఈ సినిమా ఎండ్ టైటిల్స్‌లో వచ్చే ర్యాప్ సాంగ్‌కి ప్రేక్షకులందరు ఫిదా అయ్యారు. తాజాగా ఇప్పుడు అభిమానులు మరియు ప్రేక్షకుల కోరిక మేరకు మూవీ మేకర్స్ ఈ సాంగ్ ని విడుదల చేసారు. సినిమాలోని హిట్ డైలాగ్‌లతో సింగర్ మరియు లిరిసిస్ట్ అదితి సాగర్‌ ఈ ప్రమోషనల్ సాంగ్ లో కనిపిస్తున్నారు. ఈ సెన్సేషనల్ ట్రాక్‌ని రవి బస్రూర్ కంపోజ్ చేశారు. ఈ సినిమాలో రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలింస్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ పాన్-ఇండియా చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa