కన్నడ మూవీస్ లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'విక్రాంత్ రోనా' సినిమా ఒకటి. అనుప్ బండారి డైరెక్షన్ లో స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఈ మూవీలో నటిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలతో పాటు ఇంగ్లీషులో కూడా సినిమా విడుదలవుతోంది. తాజాగా ఇప్పుడు, సెన్సషనల్ అండ్ కాంట్రోవర్సియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాని ప్రశంసిస్తూ ట్విట్టర్ లో 3Dలో ఈ సినిమాలో కొన్ని ఫుటేజీలను చూశానని మరియు ఆ స్కీన్స్స్ ఆకట్టుకున్నానని చెప్పారు. చాలా అద్భుతంగా ఉందని, ఈ సినిమా కోసం తను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని కూడా ఈ స్టార్ డైరెక్టర్ ట్వీట్ చేసారు. నిరూప్ భండారి, నీతా అశోక్ అండ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ భారీ బడ్జెట్ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. షాలిని ఆర్ట్స్ నిర్మించిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌కి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa