ఆచార్య విషయంలో తెలంగాణ సర్కార్ ఔదార్యం ప్రదర్శించింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రాంచరణ్ కలిసి నటించిన తాజా చిత్రం 'ఆచార్య' ఈ నెల 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ్ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా జరిగింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఐదో ఆటకు అనుమతి మంజూరు చేస్తూ తెలంగాణ సర్కారు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 29న విడుదల కానున్న అచార్య చిత్రాన్ని ఏడు రోజుల పాటు రోజుకు 5 ఆటల చొప్పున ప్రదర్శనకు వీలుంది. అంతేకాకుండా సినిమా హాళ్లలో ఆయా కేటగిరీలను బట్టి టికెట్ రేట్లను కూడా పెంచుకునేందుకు కూడా సినిమా థియేటర్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఏసీ కేటగిరీలో మాత్రమే ఈ పెంపును ప్రభుత్వం అనుమతించింది. ఈ ధరలను రూ.30 నుంచి రూ.50కి పెంచుకేనేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టికెట్ల పెంపును కూడా ఏడు రోజుల వరకు మాత్రమే అనుమతించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa