క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "హరి హర వీర మల్లు" సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామా ట్రాక్ లో భారీ స్థాయిలో మౌంట్ చేయబడుతోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ప్రారంభమైంది. తాజాగా ఇప్పుడు, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆన్‌సెట్ ఫోటోను ఒకటి షర్ చేసారు. ఈ ఫోటోలో క్రిష్ అండ్ పవన్ కళ్యాణ్ కెమెరా మానిటర్‌లో టేక్‌ను ఆసక్తిగా చూస్తున్నట్లు కనిపించింది. సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఈ ఫోటోలో DOP జ్ఞాన శేఖర్ మరియు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కూడా ఉన్నారు. ఈ సినిమాలో నోరా ఫతేహి, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ పాన్ ఇండియా మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa