టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అండ్ రామ్ చరణ్ నటించిన 'ఆచార్య' సినిమా ఏప్రిల్ 29, 2022న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. శివ కొరటాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు పెంచేలా మరో ట్రైలర్‌ని విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం విడుదలైన 'ఆచార్య' ట్రైలర్ అందరిని ఆకట్టుకోలేకపోయిందనేది అందరికి తెలిసిన విషయమే. సినిమా విడుదలకు ముందే ఈ కొత్త ట్రైలర్ ని విడుదల చేయనున్నారు అని సమాచారం. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నాయి. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa