ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో అద్భుతమైన మైలురాయిని క్రాస్ చేసిన 'కళావతి' సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 26, 2022, 01:01 PM

పరుశురామ్ పెట్ల డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు "సర్కారు వారి పాట" సినిమాలో నటిస్తున్నాడు అని అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. "సర్కారు వారి పాట" మే 12, 2022న థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలోని మొదటి పాట థమన్ ఎస్ పాడిన "కళావతి" మెలోడియస్ ట్రాక్ ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా మారగా, కొత్త రికార్డులు కూడా సృష్టించింది. అనంత శ్రీరామ్ రాసిన ఈ సాంగ్ కి థమన్ కంపోజ్ చేయగా సిద్ శ్రీరామ్ పాడారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఇప్పటివరకు యూట్యూబ్‌లో ఈ లిరికల్ సాంగ్ 150 మిలియన్ల వీక్షణలను క్రాస్ చేసి ఈరోజు 1.9 మిలియన్లకు పైగా లైక్‌లను సంపాదించింది. GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థమన్ స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa