సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'RC15' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. తాజాగా అమృత్‌సర్‌లో జరిగిన షెడ్యూల్‌ను మూవీ టీమ్ కంప్లీట్ చేసారు. తాజాగా రామ్ చరణ్ రక్తదాన కార్యక్రమంలో పాల్గొని 'RC15' గురించి మాట్లాడారు. ఈ చిత్రంలో షార్ట్ టెంపర్ కారణంగా ఐఏఎస్ డ్యూటీలు తీసుకోవలసి వచ్చిన IPS ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు చెప్పారు. షార్ట్ టెంపర్ యాంగిల్ సినిమా మెయిన్ హైలైట్‌లలో ఒకటి అని ఈ ఈవెంట్‌లో చరణ్ వెల్లడించారు. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa