రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా మరో రికార్డు నమోదు చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ. 1112.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అన్ని ఏరియాల్లో లాభాలు తెచ్చిపెట్టింది. 33వ రోజుతో ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల షేర్ ను రాబట్టింది. బాహుబలి 2 తర్వాత ఏ సినిమా ఈ రేంజ్‌లో షేర్ రాబట్టలేదు. బాహుబలి 2 తర్వాత రూ. 600 కోట్ల షేర్ రాబట్టిన భారతీయ సినిమాగా 'ఆర్ఆర్ఆర్' అరుదైన రికార్డును నమోదు చేసింది. త్వరలో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసే అవకాశాలున్నాయి. ఈ సినిమా మే 13 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు వార్తలు వస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa