పరశురామ్ పేట్ల డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సర్కారు వారి పాట' మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు మరియు ప్రేక్షకులు కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ప్యారిస్ లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఉన్నారు. ఈ వారం చివరిలో లేదా వచ్చే వారంలో ఆయన హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు అని సమాచారం. మహేష్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత 'సర్కారు వారి పాట' మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా మహేష్ మీడియా ఇంటర్వ్యూలలో పాల్గొంటారని సమాచారం. GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ 'సర్కారు వారి పాట' సినిమాని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa