ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'NTR30' గురించి ఆసక్తికర విషయాలని వెల్లడించిన శివ కొరటాల

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 28, 2022, 12:11 PM

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అండ్ రామ్ చరణ్ నటించిన 'ఆచార్య' సినిమా ఏప్రిల్ 29, 2022న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. శివ కొరటాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజాహెగ్డే కథానాయికగా నటించింది. మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రొమోషన్స్ ని కూడా స్టార్ట్ చేసారు. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఈ స్టార్ డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్‌తో తన తదుపరి సినిమా గురించి మాట్లాడారు. ఈ మూవీకి టెంపరరీగా 'ఎన్టీఆర్ 30' అనే టైటిల్ ని పెట్టాము. 'NTR30' మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ కాదని, అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్ అని అన్నారు. మే 20, 2022న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన మేజర్ అప్‌డేట్‌ను విడుదల చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa