ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"నువ్వొస్తానంటే నేనొద్దంటానా" మూవీ నుంచి 'ఆకాశం తాకేలా' పాట లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 28, 2022, 01:15 PM

"నువ్వొస్తానంటే నేనొద్దంటానా" మూవీ నుంచి 'ఆకాశం తాకేలా' పాట లిరిక్స్:
ఆకాశం తాకేలా వడ గాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే

ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడి గానం ప్రేమంటే

అణువణువును మీటే మమతల మౌనం
పద పద మంటే నిలవదు ప్రాణం
ఆ పలుకే ప్రణయానికి శ్రీకారం

దాహంలో మునిగిన చిగురుకు చల్లని తన చెయ్యందించీ
స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే

మేఘంలో నిద్దుర పోయిన రంగులు అన్నీ రప్పించి
మాఘాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే


ప్రాణం.. ఎపుడు మొదలైందో.. తెలుపగల తేది ఏదో గుర్తించేందుకు వీలుందా
ప్రణయం.. ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా

ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే.. ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే

అది చరితలు సైతం చదవని వైనం
కవితలు సైతం పలకని భావం
సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే

దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా.. తనలో ఈ ఒరవడి పెంచిన తొలి చినుకేదంటే
సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా.. తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే

మండే కొలిమినడగందే.. తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే
పండే పొలము చెపుతుందే.. పదునుగా నాటే నాగలి పొటే చేసిన మేలంటే

తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే గెలుపంటే
తను కొలువైవుండే విలువే వుంటే అలాంటి మనసుకు తనంతా తానై అడగక దొరికే వరమే వలపంటే

జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే నడకల్లో తడబాటైనా నాట్యం ఐపోదా
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు వుంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa