టాలీవుడ్ హీరో నిఖిల్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ గురువారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో నిఖిల్ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ్ మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.