ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎడతెరిపి లేకుండా జరుగుతున్న వీరమల్లు షూటింగ్... అందుకోసమేనా?

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 30, 2022, 03:25 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కలయికలో వస్తున్న చిత్రం హరిహరవీరమల్లు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై A. దయాకరరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి A.M రత్నం సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. 17వ శతాబ్దం నాటి మొఘల్ చక్రవర్తుల కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. తెలుగు,తమిళ,మలయాళ,హిందీ భాషలలో విడుదలవనున్న ఈ సినిమాతో పవన్ తొలి సారి పాన్ ఇండియా బరిలోకి అడుగుపెడుతున్నారు.


ఇటీవలనే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో భాగంగా హైదరాబాద్ లో వేసిన భారీ సెట్టింగులలో పవన్ పై కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రబృందం తెరకెక్కించింది. మే 2 నుండి మరో షెడ్యూల్ ను పవన్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అందులో పవన్ తో పాటు మిగిలిన నటీనటులపై కీలక సన్నివేశాలు షూట్ చెయ్యనున్నారట. మండిపోతున్న ఎండలను ఏ మాత్రం లెక్క చేయకుండా, కనీసం  కొన్ని రోజులు విరామం కూడా తీసుకోకుండా ఈ మూవీ షూట్ లో పవన్ పాల్గొనటంతో ప్రేక్షకులు తెగ మెచ్చుకుంటున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడో కంప్లీట్ అవ్వాల్సింది పవన్ రాజకీయాలతో కొంత కాలం బిజీ అవ్వడం వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. అయితే తనను నమ్ముకున్న దర్శకనిర్మాతలకు ఎలాంటి ఇబ్బంది, నష్టం కలగకూడదని పవన్ చాలా త్వరగా ఈ మూవీ షూటింగ్ ను ముగించాలనుకుంటున్నాడట. పోతే... ఈ ఏడాది లోనే ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa