చైతన్య దంతులూరి దర్శకత్వంలో రూపొందిన భళా తందనాన చిత్రంలో శ్రీవిష్ణు హీరో. వారాహి చలన చిత్రం సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో కేథరిన్ థెరిస్సా హీరోయిన్. మణిశర్మ మ్యూజిక్ అందించారు. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉన్నాయి. జనవరిలో విడుదలవ్వాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఏప్రిల్ 30న ఈ సినిమాను విడుదల చేస్తామంటూ ఈ మధ్యనే చిత్రబృందం ప్రకటించింది. ఏప్రిల్ 29న ఆచార్య ఉండటంతో మెగాధాటికి నిలబడలేక మే 6కు ఈ మూవీ విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ మూవీ నుండి గ్రీన్ టీ అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేసారు. ప్రముఖ రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళీ ఈ సినిమా కోసం తన గొంతును సవరించుకోవడం విశేషం. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటని పోసానితో కలిసి పృథ్విచంద్ర, హారికా నారాయణ్ ఆలపించారు. రైటర్ గా, యాక్టర్ గా విశేష ప్రతిభ చాటిన పోసాని గాయకుడిగా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa