ఇటీవల కాలంలో కేజీఎఫ్-2 దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేజీఎఫ్-1 ద్వారా వచ్చిన క్రేజ్‌ను సొంతం చేసుకునేందుకు హిందీలోనూ మంచి వసూళ్లే లక్ష్యంగా కేజీఎఫ్-2కు మేకర్లు ప్లాన్ చేశారు. వారి ఆశలను వమ్ము చేయకుండా ఈ సినిమా రూ.1000 కోట్లను వసూలు చేసింది. ఆర్ఆర్ఆర్‌కు ముందస్తు టికెట్ల బుకింగ్ ద్వారా హిందీలో రూ.30 కోట్లు రాగా కేజీఎఫ్-2కు రూ.50 కోట్లు వసూళ్లు దక్కాయి. ఇక సౌత్ నుంచి విడుదలైన సినిమాలలో రూ.1000 కోట్లు వసూలు చేసిన మూడో సినిమాగా కేజీఎఫ్-2 రికార్డు సృష్టించింది.
ఈ జాబితాలో బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇక కేజీఎఫ్-2తో హీరో యష్ పేరు మార్మోగిపోయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వ పటిమపైనా సినీ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. కేజీఎఫ్-3 కూడా ఉండనుందని చాప్టర్ 2చివర్లో చెప్పకనే చెప్పేశారు. దీంతో పాటు ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' సినిమా రూపొందుతోంది. ఇది కూడా భారీ విజయం సాధిస్తుందని అభిమానులు విశ్వసిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa