ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రాకింగ్ స్టార్ యష్ నటించిన 'KGF: చాప్టర్ 2' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. యాక్షన్ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో యాష్ సరసన శ్రీనిధి శెట్టి లేడీ లవ్ గా నటించింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి ఆక్యుపెన్సీని తో భారీ వసూలును రాబడుతుంది. ట్రేడ్ అప్‌డేట్ ప్రకారం, 'KGF 2' సినిమా తెలంగాణ రాష్ట్రంలో 40 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. దీంతో ఇప్పటివరకు 40 కోట్ల మార్కును దాటిన అత్యధిక డబ్బింగ్ చిత్రంగా ఈ సినిమా నిలిచింది. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa