ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్-వంశీ పైడిపల్లి సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, May 03, 2022, 01:31 PM

తమిళ స్టార్ హీరో తలపతి విజయ్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి అందరికి  తెలిసిందే. ఈ సినిమాకి టెంపరరీగా "తలపతి66" అని టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక జంటగా నటిస్తుంది. ఈ తెలుగు-తమిళ సినిమా  =చెన్నైలో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించబడింది. తాజా అప్డేట్ ప్రకారం, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈద్ బ్రేక్ పూర్తి కాగానే మరికొద్ది రోజుల్లో రష్మిక కూడా ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ కానుంది అని  సమాచారం. ప్రస్తుతం విజయ్‌కి సంబంధించిన కీలక సన్నివేశాలను మూవీ మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు అండ్ శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa