రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుల పోరాటానికి కాల్పనిక కథను జోడించి తీసిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ.1100ల కోట్ల వసూళ్లూ దక్కాయి. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఓటీటీ రిలీజ్‌పై
ఆసక్తికర చర్చ సాగుతోంది. ఓటీటీకి అలవాటు పడ్డ ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడు డిజిటల్ రిలీజ్ అవుతుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
తాజా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై సినీ వర్గాల్లో కీలక ప్రచారం సాగుతోంది. తొలుత దీనిని జూన్ 3 నుంచి ఓటీటీలో ప్రసారం చేయాలని మేకర్స్ భావించారు. అయితే అంతకంటే ముందే ఓటీటీలో విడుదల అవ్వొచ్చని తెలుస్తోంది. ఓటీటీ ప్రసార హక్కులను జీ5, నెట్‌ఫ్లిక్స్ సంస్థలు దక్కించుకున్నాయి. మే 20 నుంచి ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఈ సినిమా ప్రసారం కానుందని సమాచారం. అయితే దీనిపై సినిమా మేకర్స్ అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలో జీ5, నెట్‌ఫ్లిక్స్ సంస్థల నుంచి దీనిపై అధికార ప్రకటన రానుందని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa