పరశురామ్ డైరెక్షన్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం 'సర్కారువారిపాట'. ఇందులో కీర్తి సురేష్ కథానాయిక. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, GMB ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ కి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన కళావతి, పెన్నీ,SVP టైటిల్ పాటలు మైమరిపిస్తున్నాయి. ఈ సినిమా మే 12 న విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం అధికారిక ప్రకటన కూడా చేసింది. పరశురామ్ తాజాగా జరిగిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని మూవీ పై మరింత అంచనాలను పెంచేసాడు. పరశురామ్ మాట్లాడుతూ.... ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ ఇంతకుముందు సినిమాలలో లేని విధంగా, సరికొత్తగా ఉంటుంది. ఆయన క్యారెక్టర్ డిజైన్, ఆ రఫ్ యాటిట్యూడ్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ మూవీ కథనం, ఎంటర్టైన్మెంట్, హీరో పాత్ర మహేష్ కు చాలా నచ్చింది. అందుకే సినిమాను చెయ్యటానికి వెంటనే ఒప్పేసుకున్నారు.... అంటూ చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa