ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎఫ్ 2 ఫ్రాంచైజీలో సినిమాలు వస్తూనే ఉంటాయి - ఎడిటర్ తమ్మిరాజు

cinema |  Suryaa Desk  | Published : Tue, May 03, 2022, 11:17 PM

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ఎఫ్ 3. 2019లో విడుదలైన ఎఫ్ 2 కి సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్న ఈచిత్రానికి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తమన్నా,మెహ్రీన్ ఈ సినిమాలో కధానాయికలు కాగా,రాజేంద్ర ప్రసాద్, సునీల్, మురళి శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సోనాల్ చౌహన్ అతిధి పాత్రలో సందడి చేయనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వేసవి  కానుకగా మే 27న విడుదల చేయనున్నారు. అయితే .... ఈ మూవీ కి ఎడిటర్ గా పని చేసిన తమ్మిరాజు గారు తాజా ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దాదాపు 30 సినిమాలకు ఎడిటర్ గా పనిచేసిన తమ్మిరాజు అనిల్ రావిపూడి మొదటి సినిమా పటాస్ నుండి ఆయనతోనే ప్రయాణిస్తున్నారు. ఎఫ్ 2 లో కొత్తగా పెళ్ళైన జంట మధ్య వచ్చే చిన్ని చిన్ని గొడవలు, వైవాహిక జీవితంలో ఎదుర్కొనే సమస్యలను వాటి పరిష్కారాలను చూపించగా, ఎఫ్ 3 అందుకు భిన్నం అంటున్నారు తమ్మిరాజు. ఎఫ్ 3 మొత్తం మనిషి జీవితంలో డబ్బు ప్రాధాన్యత గురించి, సమాజానికి ఒక సందేశం ఇస్తుందని చెప్పారు. ఎఫ్ 2 అనేది ఒక ఫ్రాంచైజీ అని, దాని నుండి ఎఫ్ 4 రావొచ్చని, ఇంకా ఎక్కువ భాగాలు కూడా వచ్చే అవకాశాలున్నాయని తమ్మిరాజు పేర్కొన్నారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa