విజయ్ హీరోగా నటించిన 'బీస్ట్' చిత్రం ఓటిటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. విజయ్ సరసన పూజా హెగ్డే.. నటించింది. అయితే ఈ సినిమా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఇప్పటికే 'డాక్టర్' వంటి హిట్ అందించగా.. బీస్ట్ మూవీ లో అనిరుద్ అందించిన 'అరబిక్ కుతు' పాట కూడా బాగా పాపులర్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత ఆశించిన స్థాయిలో లేదు. కథనం పరంగా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. ఇది విజయ్ స్థాయి సినిమా కాదని ప్రేక్షకులు తేల్చేశారు. అలాంటి సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పైకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ బీస్ట్ చిత్రం ఈ నెల 11న నెట్‌ఫ్లిక్స్ మరియు సన్ నెక్స్ట్‌లో ప్రసారం కానుంది. దానికి సంబంధించిన పోస్టర్లు తాజాగా వదిలారు. మరి ఈ సినిమా OTT మార్కెట్ నుండి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోయినా.. అదే బ్యానర్ లో రజనీతో నెల్సన్ సినిమా చేయడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa