రౌడీ హీరో విజయ్ దేవరకొండతో డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ రూపొందించిన పాన్ ఇండియా చిత్రం లైగర్. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి పూరి కనెక్ట్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్టుతో నిర్మించింది. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్యా పాండే ఈ సినిమాలో విజయ్ కు జోడీగా నటిస్తుండగా బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఒక శక్తివంతమైన పాత్రలో నటిస్తుండటం విశేషం. ఈ సినిమాతో మైక్ టైసన్ భారతీయ సినీరంగ ప్రవేశం చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన గ్లిమ్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.
తాజాగా హీరో విజయ్ దేవరకొండ ఈ మూవీ నుండి ఒక మేజర్ అప్డేట్ ఇచ్చారు. భారతదేశానికి లైగర్ సత్తా చూపేందుకు ఎంతో సహనంగా ఎదురుచూస్తున్నాం. ఇప్పుడా సమయం ఆసన్నమైందంటూ మే 9, సాయంత్రం 4 గంటల నుండి లైగర్ వేట ప్రారంభం కాబోతుందని విజయ్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఈ మేరకు ఒక స్పెషల్ పోస్టర్ను కూడా పోస్ట్ చేసాడు. అయితే ఆ రోజు ఈ మూవీ నుండి ఏం రాబోతుందో అని విజయ్ ఫ్యాన్స్ వేకళ్ళతో ఎదురుచూస్తున్నారు.ఈ చిత్రం ఆగస్టు 25, 2022 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa