మన టాలీవుడ్ మాస్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “రౌద్రం రణం రుధిరం” తో తన క్రేజ్ ను మరింత స్థాయిలో పెంచుకున్నాడు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనంతరం మరో మూడు భారీ సినిమాలు ఓకే చేసిన తారక్ ఇప్పుడు వాటిలో మొదటి పాన్ ఇండియా సినిమా తన కెరీర్ లో 30వ సినిమా అలాగే దర్శకుడు కొరటాల శివతో రెండో సినిమా చేయనున్నాడు.మరి ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ కావాల్సింది కానీ పరిస్థితులు రీత్యా ఆగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఫైనల్ గా స్టార్ట్ కాబోతుండగా మళ్ళీ తారక్ తన లుక్ ని మార్చనున్నట్టు తెలుస్తుంది. ఇది వరకే ఒకసారి తారక్ ఈ సినిమా కోసం తన మేకోవర్ ని రెడీ చేసాడు కానీ అప్పుడు మళ్ళీ కరోనా మూడో వేవ్ రావడంతో RRR ప్రమోషన్స్ లో కూడా పడి మార్చేశాడు. మరి ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్రెష్ అండ్ స్టైలిష్ లుక్ లోకి మారే అవకాశం ఉన్నట్టు టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa