దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ కోసం, జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ లు దాదాపు మూడున్నరేళ్లు కష్టపడిన విషయం తెలిసిందే. అయితే, అందుకు తగ్గ విజయాన్ని, గుర్తింపును మూల్యంగా పొందారు కూడా. ఆ సినిమా విడుదల తర్వాత చెర్రీ అయ్యప్ప మాలను ధరించగా, తారక్ 21 రోజుల హనుమాన్ దీక్షను తీసుకున్నారు. తాజాగా తారక్ దీక్ష ముగియటంతో, కొరటాలతో తన తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నాడట. ఈ మేరకు ఆ సినిమాలోని హీరో పాత్రకు తగ్గట్టుగా మారేందుకు ఎన్టీయార్ కసరత్తులు మొదలెట్టాడని టాక్. ఆర్ ఆర్ ఆర్ విడుదల తర్వాత కొంచెం బరువు పెరిగినట్టుగా కనిపించిన తారక్ ఆ బరువును తగ్గించుకుని, ఫిట్ గా ఉండేందుకు కఠినమైన వ్యాయామాలనే చేస్తున్నాడని టాక్. ఈ మేరకు ఒక ఫిట్ నెస్ నిపుణిడి ఆధ్వర్యంలో తారక్ తన లుక్ ను మార్చుకోనున్నాడట.
కొరటాల డైరెక్షన్లో తారక్ నటిస్తున్న మూవీ పాన్ ఇండియాగా తెరకెక్కబోతుంది. కెరీర్ లో తారక్ కిది 30వ సినిమా. జూన్ నెల ప్రారంభంలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే మే 20న తారక్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ మూవీ అధికారిక ప్రకటన రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa