ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అశోకవనంలో అర్జునకళ్యాణం' మూవీ ఓటిటి లో సందడి చేసేది ఎప్పుడంటే...?

cinema |  Suryaa Desk  | Published : Sat, May 07, 2022, 08:27 PM

విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం 'అశోకవనంలో అర్జునకళ్యాణం'. విద్యాసాగర్ చింతా డైరెక్షన్లో సరికొత్త తరహాలో రూపొందిన ఈ చిత్రం మే 6న విడుదలైంది. తొలి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. ఇన్ ఫీరియర్ గా, ఇంట్రావర్ట్ గా నటించిన విశ్వక్ సేన్ నటనకు పేక్షకుల మంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈ మూవీ కథాకథనాలు కూడా చాలా కొత్తగా, నేటితరం యువతకు బాగా కనెక్ట్ అవుతుండటంతో ఈ మూవీకి సినీ సెలెబ్రిటీల నుండి కూడా అభినందనలు అందుతున్నాయి. అయితే .... ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను తెలుగు ఓటిటి ఆహా సంస్థ దక్కించుకుంది. జూన్ మొదటి వారం లో ఎప్పుడైనా ఈ సినిమా ఓటిటిలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయని టాక్. ఈ మేరకు త్వరలనే అధికారిక ప్రకటన వెలువడనుందట. 


అయితే, నిన్ననే ధియేటర్లలోకొచ్చిన  'అశోకవనంలో అర్జునకళ్యాణం'  మూవీ పబ్లిక్ టాక్ బాగానే ఉంది కాబట్టి, మంచి కలెక్షన్లే వచ్చే అవకాశాలున్నాయి. దీంతో నెలరోజుల్లోనే ఈ మూవీ ఓటిటిలోకి ఎందుకు వస్తుందంటూ మరికొంతమంది తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa