ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను : వంశీ పైడిపల్లి

cinema |  Suryaa Desk  | Published : Sat, May 07, 2022, 10:56 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా 'సర్కారువారిపాట'. పరశురామ్ డైరెక్షన్లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో కీర్తిసురేష్ కధానాయిక. తాజాగా ఈ  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. దర్శకుడు నాకు ఎప్పటి నుండో తెలుసు, ఆయన కష్టాన్ని దగ్గరి నుంచి చూశాను. ట్రైలర్ తోనే  సినిమాకి హిట్ తెచ్చిపెట్టావు. ఈ సినిమా కోసం తమన్ ప్రాణం పెట్టాడు. మహర్షి అనే కథతో మహేష్ గారి దగ్గరకు వెళ్లాను. కానీ మీ జీవితంలో మీరు నాకు ఇచ్చిన స్థానానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా స్నేహితుడు, తమ్ముడు, మహేష్ అంతకంటే ఎక్కువ. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa