ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ సినిమా కోసం మూడున్నరేళ్లు కష్టపడ్డాం : పరశురామ్

cinema |  Suryaa Desk  | Published : Sat, May 07, 2022, 11:25 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా 'సర్కారువారిపాట'. పరశురామ్ డైరెక్షన్లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో కీర్తిసురేష్ కధానాయిక. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతుంది.


ఈ కార్యక్రమంలో దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ.. గీత గోవిందం తర్వాత  'సర్కారువారిపాట కథను రాసి కొరటాల శివ గారి ద్వారా మహేష్ గారిని కలిశామన్నారు. మహేష్ బాబు గారిని మొదటిసారి కలిసినప్పుడు భయపడ్డాను. కథ చెప్పగానే అతని ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది. ఆ నవ్వు నాకు ధైర్యాన్నిచ్చింది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలి అని మహేష్ అన్నారు.నేను చేయగలిగినంత చేశాను. నా మీద నమ్మకం ఉంచినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఈ సినిమాలో నా నిర్మాతలు నేను అడిగినవన్నీ ఇచ్చారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సినిమా కోసం మూడున్నరేళ్లు కష్టపడ్డాం. ఇన్నేళ్లుగా నాకు సపోర్ట్ చేసిన డైరెక్షన్ టీమ్‌కి చాలా థ్యాంక్స్. నాకు తమన్‌తో ఈ సినిమా ప్రయాణం లాక్‌డౌన్‌లో మొదలైంది. ఈ సినిమాతో పెద్ద విజయాన్ని అందిస్తాం'' అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa