సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని 'ఏజెంట్' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. స్పై థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తుంది. ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అని మూవీ మేకర్స్ ప్రకటించారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉంది అని సమాచారం. షూటింగ్ ఇంకా పూర్తి కానందున, ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కాకపోవచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి మూవీ మేకర్స్ అధికారకంగా ఏమి ప్రకటించలేదు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa