సినిమా ప్రపంచంలో టాప్ డైరెక్టర్స్ లో జేమ్స్ కామెరూన్ ఒకరు. ఈ స్టార్ డైరెక్టర్ కెరీర్‌లో కొన్ని మైండ్ బ్లోయింగ్ సినిమాలని తీశారు. టైటానిక్, అవతార్ లాంటి సినిమాలతో సినిమా ప్రేమికులని అండ్ ప్రేక్షకులని మెస్మరైజ్ చేశాడు. చాలా కాలంగా ఈ డైరెక్టర్ అవతార్ సీక్వెల్ కోసం పని చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. డిసెంబర్ 16, 2022న ప్రపంచవ్యాప్తంగా 160కి పైగా భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. అవతార్ సీక్వెల్ గా రానున్న ఈ మూవీకి 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. అవతార్ 2 టీజర్ విజువల్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి, ముఖ్యంగా కొన్ని నీటి అడుగున షాట్స్ అందరిని ఆకట్టుకున్తున్నాయి. టీజర్‌ను బట్టి చూస్తే జరుగుతున్న యుద్ధానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. కామెరాన్ మరియు జాన్ లాండౌ నిర్మించిన ఈ చిత్రంలో జో సల్దానా, సామ్ వర్తింగ్టన్, సిగౌర్నీ వీవర్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa