ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబులో దూసుకుపోతున్న మ మ మ మహేష్ సాంగ్.

cinema |  Suryaa Desk  | Published : Tue, May 10, 2022, 04:46 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం సర్కారువారిపాట. ఇందులో కీర్తి సురేష్ కథానాయిక. గీతగోవిందం ఫేమ్ పరశురామ్ డైరెక్షన్లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, GMB ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ కి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన కళావతి, పెన్నీ,SVP  టైటిల్  పాటలు శ్రోతలను మైమరిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా విడుదలైన మ మ మ మహేష్ పాట విడుదలై మహేష్ ఫ్యాన్స్ ను మరింత సంతోషాన్నిచ్చింది. రెండు రోజుల్లో 20 మిలియన్లకు పైగా వీక్షణలతో యూట్యూబులో దూసుకుపోతుంది. తమ అభిమాన నటుడి మాస్ స్టెప్స్ కు, ఆ యాటిట్యూడ్ కు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మే 12న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa