వెంకీ అట్లూరి దర్శకత్వంలో స్టార్ హీరో ధనుష్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తెలుగు ద్విభాషా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి తమిళంలో "వాతి" అని తెలుగులో "సర్" టైటిల్ ని ప్రకటించారు. ఈ సినిమా పూజా కార్యక్రమం లాంఛనంగా జరిగింది. ఈ సినిమాలో మలయాళ నటి సంయుక్తా మీనన్‌ని కథానాయికగా నటిస్తుంది. తాజాగా ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సినిమా ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల ప్రయాణం పూర్తి చేసుకున్నాడు. ఈ స్టార్ హీరో తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ, 'నా అభిమానుల నిరంతర ప్రేమ మరియు మద్దతుకు నేను కృతజ్ఞతలు, మీరు నా బలానికి మూలస్తంభాలు, నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను' అని పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా 'సర్' మూవీ మేకర్స్ ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను అందించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను త్వరలో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్య దేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా "సర్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa