ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తదుపరి సినిమాల అప్ డేట్స్ రానున్నాయి. మే 20న ఎన్టీఆర్ 30, 31వ సినిమాలకు సంబంధించి అదిరిపోయే సర్ప్రైజ్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ నటించే 30వ సినిమాకి కొరటాల శివ దర్శకుడు కాగా, ఎన్టీఆర్ 31వ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రెండు సినిమాల నుంచి పోస్టర్లను రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జూన్ లో ఎన్టీఆర్ 30, అక్టోబర్లో ఎన్టీఆర్ 31 సినిమాలు సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు శంకర్- ఎన్టీఆర్, బుచ్చిబాబు-ఎన్టీఆర్ కాంబోలో సినిమాలు రానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.